Share News

సామాజిక తనిఖీలతో పనుల్లో నాణ్యత

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:39 PM

సామాజిక తనిఖీల ద్వారా ఉపాధి పనులు సమర్థవంతంగా జరుగుతాయని డీఆర్‌డీవో పీడీ శ్రీలత వివరించారు.

సామాజిక తనిఖీలతో పనుల్లో నాణ్యత
మాట్లాడుతున్న డీఆర్‌డీవో పీడీ శ్రీలత

డీఆర్‌డీవో పీడీ శ్రీలత

కేశంపేట, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): సామాజిక తనిఖీల ద్వారా ఉపాధి పనులు సమర్థవంతంగా జరుగుతాయని డీఆర్‌డీవో పీడీ శ్రీలత వివరించారు. కేశంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులపై ప్రజావేదిక, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు 1,47,62,978 రూపాయలతో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ ఉపాధి పనులు నిబంధనల మేరకు చేయాలని సూచించారు. వీటికి సంబంధించిన బిల్లుల చెల్లింపు, కూలీల వేతనంలో వ్యత్యాసం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబుడ్స్‌మెన్‌ సునీత, సీనియర్‌ క్యాలిటీ ఆఫీసర్‌ భానుశంకర్‌, జూనియర్‌ క్యాలిటీ ఆఫీసర్‌ సునీత, అసిస్టెంట్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ కొండలయ్య, ఏపీడీ గౌతమ్‌, స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రాఘవులు, ఎంపీడీవో రవిచంద్రకుమార్‌ రెడ్డి, ఎంపీవో కిష్టయ్య, టీఏ అజీజ్‌, నీలకంఠబాబు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:39 PM