మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:45 PM
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. గురువారం గొట్టిగఖుర్దు పాఠశాలను తనిఖీ చేశారు.

-అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
బషీరాబాద్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. గురువారం గొట్టిగఖుర్దు పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, వంట గదులను పరిశీలించారు. వంట ఏజెన్సీ మహిళలతో మాట్లాడి బియ్యం ఎలాగున్నాయని అడిగారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అన్నం ఎలా ఉంటోంది.. మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా? అని తెలుసుకున్నారు. భోజన నాణ్యతలో నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు, వంట వారికి సూచించారు. అంతకు ముందు కాశీంపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులు మంగమ్మ, నర్సమ్మలతో మాట్లాడి సూచనలు చేశారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి మోహన్‌బాబు, తహసీల్దార్ వై.వెంకటేష్ ఉన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
తాండూరు రూరల్: చెంగోల్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లింగ్యానాయక్ పరిశీలించారు. ఎన్ని క్వింటాళ్ల వడ్లు కొన్నారని కేంద్రం నిర్వాహకులను అడిగారు. 4,500 బస్తాలు కాంట వేశామని, మరిన్ని వడ్లు రానున్నాయని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కల్గించకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ వెంట తహసీల్దార్ తారాసింగ్, రైతులు ఉన్నారు.