Share News

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:08 AM

కార్పోరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ఎంఈవో సర్ధార్‌ నాయక్‌ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
మొయినాబాద్‌ రూరల్‌ : ర్యాలీలో ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్‌ రాజు తదితరులు

కడ్తాల్‌ ఎంఈవో సర్ధార్‌ నాయక్‌

కడ్తాల్‌, జూన్‌ 11: కార్పోరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ఎంఈవో సర్ధార్‌ నాయక్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్య అందుతుందన్నారు. మండలంలోని మైసిగండి గ్రామంలో మంగళవారం కడ్తాల జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం, సీఆర్‌పీలతో కలిసి ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈవో, నోడల్‌ అధికారి జంగయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.

ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలి

మొయినాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బడీడు పిల్లలను బడికి పంపించాలని అప్పోజిగూడ గ్రామ మాజీ సర్పంచ్‌ గొర్కంటి రాజు, ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయులు నర్సింహలు కోరారు. మండల పరిధిలోని అప్పోజిగూడలో ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాల, యునెటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థల సంయుక్త అధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి జ్యోష్న, ఉపాధ్యాయురాలు అమృత, సీమకదం, సత్యనారాయణ, సౌమ్య, హరీష్‌, ప్రభులింగం, రాజు, శివాజీ యూత్‌ సంఘం అధ్యక్షుడు జగపతి, నాయకులు తదితరులున్నారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

కేశంపేట : పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాపిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జి.మాధవి, అరుణకుమారి, స్వప్న, కే. శ్రీదేవి కోరారు. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో మంగళవారం ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమెన విద్యతో పాటు, ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 12:08 AM