Share News

ప్రజా సంక్షేమమే లక్ష్యం : వీర్లపల్లి

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:53 PM

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రైతుల అభివృద్ధే ధేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. గురువారం కొందుర్గు మండలం ముట్పూర్‌ రైతు వేదికలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సులోచనతో కలిసి ప్రారంభించారు. ముట్పూర్‌నకు చెందిన విద్యార్థిని పెద్దింటి శృతి 6వతరగతి చదువుతోంది. రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికవ్వడంతో ఎమ్మెల్యే సన్మానించి రూ.5వేల ప్రోత్సాహకం అందజేశారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం : వీర్లపల్లి
కొందుర్గు మండలం ముట్పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

చౌదరిగూడ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రైతుల అభివృద్ధే ధేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. గురువారం కొందుర్గు మండలం ముట్పూర్‌ రైతు వేదికలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సులోచనతో కలిసి ప్రారంభించారు. ముట్పూర్‌నకు చెందిన విద్యార్థిని పెద్దింటి శృతి 6వతరగతి చదువుతోంది. రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికవ్వడంతో ఎమ్మెల్యే సన్మానించి రూ.5వేల ప్రోత్సాహకం అందజేశారు. షాద్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ బాబర్‌ఖాన్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, డైరెక్టర్‌ వెంకటనర్సింహారెడ్డి, కొందుర్గు మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లేడ్‌ చౌదరిగూడ మండలాధ్యక్షుడు రాజు, తదితరులున్నారు.

సారూ.. మీ కాళ్లు మొక్కుతా.. మా భూమిని ఇప్పించండి

సారూ.. మీ కాళ్లు మొక్కుతా.. మా భూమి మాకు ఇప్పించాలంటూ ఓ వృద్దురాలు ఎమ్మెల్యే శంకర్‌ను వేడుకుంది. ముట్పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి శంకర్‌ వచ్చారు. గ్రామానికి చెందిన బుయ్యని లక్ష్మమ్మకు గ్రామ రెవెన్యూ పరిధి సర్వేనంబర్‌ 282లో 11 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు విక్రయించారని ఎమ్మెల్యేకు వివరించింది. బుధవారం పొలంలో మొక్కజొన్నలు వేశారని, ఎమ్మెల్యేకు వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. మీ కాళ్లు మొక్కుతా.. మా భూమి మాకు ఇప్పించాలని వేడుకుంది. మీరు పొలం ఎవరికైనా అమ్మారా? లేదా? అని ఎమ్మెల్యే ఆమెను అడిగారు. అక్రమంగా భూమిని లాక్కుంటే వదిలిపెట్టేది లేదని, గ్రామ నాయకులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు.

కళాశాలల నిర్మాణానికి సీఎ్‌సఆర్‌ నిధులివ్వండి

షాద్‌నగర్‌ అర్బన్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): షాద్‌నగర్‌ పట్టణ సమీపంలో నిర్మించతలపెట్టిన ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల నిర్మాణానికి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి వచ్చే సీఎ్‌సఆర్‌ నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే శంకర్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డిని కోరారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన్ను కలిసి నిధులు కేటాయించాలని కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు. నాయకులు కృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:53 PM