Share News

ప్రజా సంక్షేమమే ధ్యేయం : వీర్లపల్లి

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:24 AM

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం : వీర్లపల్లి
కొత్తూర్‌ : తీగాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

నందిగామ, ఫిబ్రవరి 26: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామనేఇ వివరించారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల కుటుంబాలే బాగుపడ్డాయి తప్పా సామాన్య ప్రజలకు ఒనగూరింది ఏమీ లేదన్నారు. అనంతరం మండల కేంద్రం నుంచి బైపాస్‌ రోడ్డు వరకు అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు పనులను ప్రారంభించారు. రోడ్డు పనులకు రూ.40లక్షల హెచ్‌ఎండీఏ నిధులు ఇప్పించినట్లు ఆయన తెలిపారు. ఎంపీపీ ప్రియాంక శివశంకర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ తలసీరామ్‌ నాయక్‌, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, దేపల్లి కుమార్‌గౌడ్‌, తహసీల్దార్‌ రాజేశ్వర్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు జంగ నర్సింలు యాదవ్‌, రాజగోపాల్‌, అశోక్‌, పాండు రంగారెడ్డి, బాల్‌రెడ్డి, రామ్‌రెడ్డి, అంజు యాదవ్‌, దారలింగం, తుమ్మల నర్సింలు, వెంకట్‌రెడ్డి, శ్రీశైలం, విగ్నే్‌షరెడ్డి, జ్ఞానేశ్వర్‌, అంజయ్య యా దవ్‌, శ్రవణ్‌, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే

కొత్తూర్‌ : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మండల పరిధిలోని తీగాపూర్‌ గ్రామంలో రూ.50లక్షలతో నిర్మించతలపెట్టిన తీగాపూర్‌-ఫాతిమాపూర్‌ సీసీ రోడ్డు పనులను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అంచలంచెలుగా పరిష్కారిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రజలు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలతసత్యనారాయణ, ఎంపీటీసీ బి.జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, నాయకులు మెండె నర్సింహ, కృష్ణ, జి.రాజు, ఆంజనేయులు, జనార్దన్‌, జంగయ్య, శేఖర్‌, చెన్నయ్య, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:24 AM