ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:18 AM
ప్రజా సమస్యలపై కార్యకర్తలు నిరంతరం పోరాడాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు జాన్‌వెస్లీ సూచించారు. మంగళవారం సీపీఎం రంగారెడ్డి జిల్లా శిక్షణా తరగతుల్లో భాగంగా రెండోరోజు నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి శివారులోని కాకా గెస్ట్‌హౌ్‌సలో జరిగిన కార్యక్రమానికి జాన్‌వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సీపీఎం రాష్ట్ర నాయకుడు జాన్‌వెస్లీ
నందిగామ, జూలై 30: ప్రజా సమస్యలపై కార్యకర్తలు నిరంతరం పోరాడాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు జాన్‌వెస్లీ సూచించారు. మంగళవారం సీపీఎం రంగారెడ్డి జిల్లా శిక్షణా తరగతుల్లో భాగంగా రెండోరోజు నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి శివారులోని కాకా గెస్ట్‌హౌ్‌సలో జరిగిన కార్యక్రమానికి జాన్‌వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారత్ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా పోరాటాల్లో కార్యకర్తల కృషి మరువలేనిదని, ప్రజా సమస్యలపై మరింత పోరాడాలన్నారు. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా బీజేపీ పరిపాలన చేస్తుందని ఆరోపించారు. దేశంలో మతోన్మాదం, మూఢనమ్మకాలు పెరిగిపోయాయని, దీనికి బీజేపీ ప్రతినిధిగా ఉందన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, వారు అనుకున్నట్టు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు తొలగిస్తే దేశం ప్రమాదంలోకి వెళ్తుందని సూచించారు. సాంస్కృతిక, సామాజిక, సాంకేతికత, విద్యారంగాల్లో నైపుణ్యాలు పెంపొందించాలని, దానికనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విదానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, బాస్కర్, రాజు, సామ్యేల్, చంద్రమోహన్, జగదీష్, యాదయ్య, శోభన్, కవిత, నర్సిరెడ్డి, అంజయ్య, శ్రీను నాయక్, ఈశ్వర్, కుర్మయ్య, వెంకటరమణ, మహమ్మద్ బాబు, లక్ష్మి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.