‘కోట మైసమ్మ’ స్థలాన్ని పరిరక్షించండి
ABN , Publish Date - Aug 18 , 2024 | 12:07 AM
అన్యాక్రాంతమవుతున్న కోటమైసమ్మ ఆలయ స్థలాన్ని పరిరక్షించాలని వీరన్నపేట గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం చౌదరిగూడ తహసీల్దార్ జగదీశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.
చౌదరిగూడ, ఆగస్టు 17: అన్యాక్రాంతమవుతున్న కోటమైసమ్మ ఆలయ స్థలాన్ని పరిరక్షించాలని వీరన్నపేట గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం చౌదరిగూడ తహసీల్దార్ జగదీశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వీరన్నపేట రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ ఎ4లో 11 గుంటల భూమిలో అతి పురాతనమైన కోట ఉందని, అందులో గుప్త నిధులు ఉన్నాయని కొందరు తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తులంతా తవ్వకాలను అడ్డుకుంటున్నామని, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకట్రాములు, అంజయ్య, హరీష్ తదితరులు ఉన్నారు.