మహిళల అభివృద్ధికి ప్రోత్సాహం
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:41 PM
మహిళా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని డీఆర్‌డీవో పీడీ శ్రీలత అన్నారు.

డీఆర్‌డీవో పీడీ శ్రీలత
నందిగామ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి) : మహిళా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని డీఆర్‌డీవో పీడీ శ్రీలత అన్నారు. గురువారం నందిగామ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. బ్యాంకు రుణాలు, పీఎంఎ్‌ఫఎంఈ, కోళ్ల పెంపకం, చిన్న తరహా వ్యాపారాలు, ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు, మహిళా సమాఖ్య సాధించిన ప్రగతిపై చర్చించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ఆమె సందర్శించారు. మండల మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద తెలంగాణ రైసింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. సూర్యారావు, యాదగిరి, అనురాధ, అరుణ, యాదయ్య పాల్గొన్నారు.