Share News

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:03 AM

ప్రజావాణిలో భాగంగా వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి
ఫిర్యాదులను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

వికారాబాద్‌, ఫిబ్రవరి 5: ప్రజావాణిలో భాగంగా వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. మొత్తం 125 ఫిర్యాదు వచ్చాయని అడిషనల్‌ కలెక్టర్‌ తెలిపారు. ఈ దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మేడ్చల్‌ ప్రజావాణికి 150 ఫిర్యాదులు

కీసర: మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 150 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల వారి నుంచి వచ్చిన వారు దరఖాస్తులు అందజేశారు. కాగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కారించాలని జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Updated Date - Feb 06 , 2024 | 12:03 AM