Share News

‘పట్నం’కు పదవి!

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:56 PM

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పదవిని కట్టబెట్టింది. మహేందర్‌రెడ్డిని ప్రభుత్వ చీఫ్‌వి్‌పగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేశారు.

‘పట్నం’కు పదవి!
పట్నం మహేందర్‌రెడ్డి

ప్రభుత్వ చీఫ్‌ వి్‌పగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి నియామకం

ఈ నెల 15నే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తాండూరు, మార్చి 18 : ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పదవిని కట్టబెట్టింది. మహేందర్‌రెడ్డిని ప్రభుత్వ చీఫ్‌వి్‌పగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో నంబర్‌ 103ను ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల కోడ్‌కు ముందే ఉత్తర్వులిచ్చినా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రాజకీయ సమీకరణల్లో భాగంగానే మహేందర్‌రెడ్డికి చీఫ్‌విప్‌ పదవిచ్చారన్న చర్చ సాగుతోంది. చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపీ రంజిత్‌రెడ్డి ఖరారయ్యే అవకాశాలున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డికి పదవివ్వడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే మహేందర్‌రెడ్డికి ప్రభుత్వ పదవి ఇచ్చినా ఆయన సతీమణి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సునీతారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఇవ్వనున్నట్టు సమాచారం!

Updated Date - Mar 18 , 2024 | 11:56 PM