పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:21 AM
శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామ శివారులోని అరుణ్‌కుమార్ ఫాంహౌ్‌సలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
ఏడుగురిపై కేసు.. రూ.లక్షా 20వేలు స్వాధీనం
శంషాబాద్ రూరల్, జూలై 30: శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామ శివారులోని అరుణ్‌కుమార్ ఫాంహౌ్‌సలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం రాత్రి ఫాంహౌ్‌సపై దాడి నిర్వహించగా పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు మంగళవారం ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. పేకాటాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.1,20,250, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.