Share News

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:57 PM

అక్రమంగా పాడిపశువుల రవాణా, విత్తనాల క్రయ విక్రయాలను నివారించడం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు.

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
మాల్‌లో ముమ్మరంగా వాహనాల తనిఖీ

యాచారం, జూన్‌ 5 : అక్రమంగా పాడిపశువుల రవాణా, విత్తనాల క్రయ విక్రయాలను నివారించడం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. బుధవారం మాల్‌లో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. పాడిపశువులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాలుగు రోజుల్లో 30 పాడిపశువులను పట్టుకొని గోశాలకు తరలించామని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల తనిఖీకి వాహనాదారులు సహకరించాలని కోరారు.

Updated Date - Jun 05 , 2024 | 11:57 PM