Share News

ప్లాట్‌ కబ్జా.. తండ్రీ కొడుకులపై కేసు

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:41 PM

ప్లాట్‌ కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన చౌదరిగూడ మాజీ సర్పంచ్‌ బైరు రాములుగౌడ్‌, అతడి కొడుకు బైరు విఘ్నే్‌షగౌడ్‌లపై పోచారం ఐటీసీ పోలీసులు కేసు నమోదుచేశారు.

ప్లాట్‌ కబ్జా.. తండ్రీ కొడుకులపై కేసు
బైరు రాములుగౌడ్‌, అతడి కుమారుడు విఘ్నే్‌షగౌడ్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 6: ప్లాట్‌ కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన చౌదరిగూడ మాజీ సర్పంచ్‌ బైరు రాములుగౌడ్‌, అతడి కొడుకు బైరు విఘ్నే్‌షగౌడ్‌లపై పోచారం ఐటీసీ పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బేగంపేట్‌కు చెందిన వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించే మల్లారెడ్డి 2005లో ఘట్‌కేసర్‌ మండలం, చౌదరిగూడ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్‌ 261 పార్టులో 756 ప్లాట్‌ను కొనుగోలు చేశాడు. మల్లారెడ్డి తన ప్లాట్‌ చుట్టూ ప్రహరీ నిర్మించుకొని అందులో బోరు వేశాడు. అయితే అదేగ్రామ మాజీసర్పంచ్‌ బైరు రాములుగౌడ్‌ అతడి కుమారుడు బైరు విఘ్నే్‌షగౌడ్‌లు ప్లాట్‌ను కబ్జాచేసి ప్రహారీ, బోరును ధ్వంసం చేశారు. ఇదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరింపులకు పాల్పడారని, దీంతో మల్లారెడ్డి ప్లాట్‌ కబ్జా విషయమై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు ప్లాట్‌ కబ్జాచేసి బైరు రాములుగౌడ్‌, అతడి కుమారుడు బైరు విఘ్నే్‌షగౌడ్‌లపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పోచారం ఐటీసీ పోలీసులను ఆదేశించారు. విచారణ చేపట్టిన పోలీసులు బైరు రాములుగౌడ్‌, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jun 06 , 2024 | 11:41 PM