Share News

పీజేఆర్‌ సేవలు మరువలేనివి

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:34 PM

కార్మిక నాయకుడిగా, శాసన సభ్యుడిగా పి.జనార్థన్‌రెడ్డి(పీజేఆర్‌) చేసిన సేవలు మరువలేనివని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కొనియాడారు. షాద్‌నగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్‌ వర్ధంతిని నిర్వహించారు.

పీజేఆర్‌ సేవలు మరువలేనివి
పీజేఆర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

షాద్‌నగర్‌ అర్బన్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కార్మిక నాయకుడిగా, శాసన సభ్యుడిగా పి.జనార్థన్‌రెడ్డి(పీజేఆర్‌) చేసిన సేవలు మరువలేనివని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కొనియాడారు. షాద్‌నగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మిక సంఘం నాయకుడిగా జనార్థన్‌రెడ్డి తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎనలేని ప్రజాసేవ చేశారని, పీజేఆర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకులు పి.వెంకట్‌రాంరెడ్డి, శివశంకర్‌గౌడ్‌, ఎ.కృష్ణారెడ్డి, కె.చెన్నయ్య, గడ్డం శ్రీనివాస్‌, అగ్గనూరి బస్వం, అంబటి ప్రభాకర్‌, చంద్రశేఖర్‌, మసూద్‌ఖాన్‌, యాదగిరియాదవ్‌, ఎల్‌.శివశంకర్‌రెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ పెంచుకుంటేనే ప్రగతి : ఎమ్మెల్యే

పోటీ ప్రపంచంలో ప్రతిభ పెంచుకునే యువత మాత్రమే జీవితంలో ప్రగతిని సాధిస్తారని ఎమ్మెల్యే శంకర్‌ తెలిపారు. మైక్రోసాఫ్ట్‌, యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్నిఫీ నిర్వహించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కార్యక్రమం శనివారం షాద్‌నగర్‌ మున్సిపాలిటీ సమావేశ హాలులో నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ యువత నేటి సమాజంలో మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలుగా ఎదగాలంటే సరైన శిక్షణను తీసుకోవాలని సూచించారు. యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి మార్గాలను చూయిస్తున్న మైక్రోసాఫ్ట్‌, యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థలను ఎమ్మెల్యే అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. యువతలో విజ్ఞానాన్ని మరింతగా పెంచడానికి తరచు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ, యువతకు మార్గం చూపాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, ముందుకు సాగుతున్నారని శంకర్‌ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, కమిషనర్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:34 PM