Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:48 PM

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 12: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ, యంనంపేట్‌కు చెందిన బండారి బాల్‌రాజ్‌(46) స్థానిక శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్నాడు. రోజూమాదిరిగానే ఈనెల 6వ తేదీన కళాశాలకు వెళ్ళి మధ్యాహ్నం సొంత పనిపై ఘట్‌కేసర్‌కు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాల్‌రాజ్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఫీర్జాదిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 11:48 PM