పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:38 PM
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు డిమాండ్ చేశారు.

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం తహసీల్దారు కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి ఏర్పుల తరంగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరేళ్లుగా రూ.8,243 కోట్లు బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీరుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు మస్కు చరణ్, వంశీ, శ్రీకాంత్, లక్ష్మణ్, రాకేష్ ఉన్నారు.