Share News

పేదల సంక్షేమానికి పెద్దపీట : మల్‌రెడ్డి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:58 PM

పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిధిలో శుక్రవారం ఆయన పర్యటించి వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

పేదల సంక్షేమానికి పెద్దపీట : మల్‌రెడ్డి

మంచాల, జనవరి 12 : పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిధిలో శుక్రవారం ఆయన పర్యటించి వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. జాపాలలో జ్యోతిరావు పూలే, మంచాలలో చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. బోడకొండ, ఎల్లమ్మ తండాలో రూ.5లక్షలతో చేపట్టే సీసీ రోడ్డుపనులకు శంకుస్థాపన చేశారు. వీఆర్‌వన్‌ ఫౌండేషన్‌ అధ్వర్యంలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటుచేసిన ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. మంచాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీపీ నర్మద, జెడ్పీటీసీ నిత్యనిరంజన్‌రెడ్డి, సర్పంచులు జగన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, అలివేలు, సపావట్‌పద్మ, నౌహీద్‌బేగం, జాటోత్‌ అలివేలు, ఎంపీటీసీలు ఎడమ నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, జయానందం, వాజీద్‌, అధికారులు పాల్గొన్నారు.

దశలవారీగా ప్రజాసమస్యల పరిష్కారం

ఇబ్రహీంపట్నం : దశలవారీగా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డిరంగారెడ్డి అన్నారు. మునిసిపాలిటీ 8వవార్డు భాగ్యనగర్‌ కాలనీలో పర్యటించి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పూర్తిస్థాయిలో డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి డ్రైనేజీ నిర్మించాలని కమిషనర్‌ రవీంద్రసాగర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. చైర్‌పర్సన్‌ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

ఫార్మాసిటీ బాధిత రైతులను ఆదుకుంటాం

యాచారం : ఫార్మాసిటీ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని, ఇచ్చిన హామీ మేరకు ఫార్మాసిటీ బాధిత రైతులను ఆదుకుంటామని మల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో 22 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, వైస్‌ఎంపీపీ కె, శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:58 PM