Share News

కనుల పండువగా పెద్దమ్మతల్లి కల్యాణం

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:59 PM

తూంకుంట మున్సిపల్‌ ఉప్పరిపల్లి పరిధిలోని శ్రీపెద్దమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పెద్దమ్మతల్లి, పెద్దరాజుల కల్యాణం భక్తుల కోలహలం మధ్య నిర్వహించారు.

కనుల పండువగా పెద్దమ్మతల్లి కల్యాణం
అమ్మవారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

శామీర్‌పేట, ఏప్రిల్‌ 13: తూంకుంట మున్సిపల్‌ ఉప్పరిపల్లి పరిధిలోని శ్రీపెద్దమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పెద్దమ్మతల్లి, పెద్దరాజుల కల్యాణం భక్తుల కోలహలం మధ్య నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం అన్నదానం చేపట్టగా భక్తులు పెద్దఎత్తున పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి అమ్మవారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కల్యాణ మహోత్సవంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, వివిధపార్టీల నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Apr 13 , 2024 | 11:59 PM