Share News

ధ్యానంతో మానసిక ప్రశాంతత

ABN , Publish Date - Nov 03 , 2024 | 11:43 PM

మానసిక ప్రశాంతతకు ప్రతీఒక్కరు ధ్యానం చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం బ్రహ్మకుమారి మెడిటేషన్‌ సెంటర్‌ ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. నేడు ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదని చెప్పారు.

ధ్యానంతో మానసిక ప్రశాంతత
ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు మొక్కను బహూకరిస్తున్న బ్రహ్మకుమారి

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి) : మానసిక ప్రశాంతతకు ప్రతీఒక్కరు ధ్యానం చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం బ్రహ్మకుమారి మెడిటేషన్‌ సెంటర్‌ ప్రథమ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. నేడు ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదని చెప్పారు. ఎంత సంపదన ఉన్నా ఆరోగ్యం బాగోలేకపోతే జీవితం వృథా అని చెప్పారు. అందుకోసమే ప్రతీఒక్కరు ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాలని కోరారు. అంతకుముందు ఆయన శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి, నార్సింగ్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ దూడల వెంకటేష్‌గౌడ్‌, బ్రహ్మకుమారిస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 11:43 PM