Share News

భవనంపై నుంచి పడి పెయింటర్‌ మృతి

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:31 AM

భవనంపై నుంచి పడి పెయింటర్‌ మృతిచెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.

భవనంపై నుంచి పడి పెయింటర్‌ మృతి

మూడుచింతలపల్లి, ఏప్రిల్‌ 12: భవనంపై నుంచి పడి పెయింటర్‌ మృతిచెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. శామీర్‌పేట్‌ గ్రామానికి చెందిన మంగళారపు బిక్షపతి(46) పేయింటింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శామీర్‌పేట్‌లో గత ఒక సంస్థ భవనం రెండో అంతస్తులో గురువారం పెయింటింగ్‌ పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు రోప్‌తాడు తెగిపోవడంతో భవనంపై నుంచి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

కొడంగల్‌: రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన కొడంగల్‌లో చోటుచేసుకుంది. కొడంగల్‌ ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రావుల్‌పల్లి గ్రామానికి చెందిన తలారి నర్సప్ప(50) శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటిముందు నడుచుకుంటూ హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే దాటుతున్నాడు. ఈ క్రమంలో ఓటాటాఎస్‌ వాహనం హైదరాబాద్‌ నుంచి సేడం వైపు వేగంగా వెళ్తూ రోడ్డు దాటుతున్న తలారి నర్సప్పను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన నర్సప్పను ఆటోలో చికిత్స నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు తలారి అశోక్‌ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన జల్‌పల్లి కాటేదాన్‌ హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ అకాశ్‌గిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మరొకరు..

బొంరా్‌సపేట్‌: మండలంలోని కొత్తూర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన పెద్ద కుర్వ నర్సింహులు (48) గురువారం రాత్రి ఇంట్లో భోజనం చేసి రోజూ మాదిరిగా నిద్రించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించగా మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు కుర్వ అంజిలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్‌ రవూఫ్‌ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని కొడంగల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గ్రామానికి వెళ్లి మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Updated Date - Apr 13 , 2024 | 12:31 AM