Share News

ఘట్‌కేసర్‌లో ఆపరేషన్‌ ముస్కాన్‌

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:31 PM

ఏడుగురు బాలకార్మికులను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

ఘట్‌కేసర్‌లో ఆపరేషన్‌ ముస్కాన్‌

  • బాలల సంరక్షణ కేంద్రానికి ఏడుగురు బాలకార్మికుల తరలింపు

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 17: ఏడుగురు బాలకార్మికులను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్‌ పట్టణంలోని పలుదుకాణాలపై బుధవారం పోలీసులు, ఆపరేషన్‌ ముస్కాన్‌ బృందం(బాలల బాధ్యత సంస్థ) సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఏడుగురు బాలకార్మికులను గుర్తించారు. బాలకార్మికులతో పనులు చేయిస్తున్న పెట్రోల్‌బంక్‌, మెకానిక్‌, చాయ్‌, చిల్లర దుకాణాల యజమానులపై కేసు నమోదు చేశారు. బాలకార్మికులను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 11:31 PM