రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:16 PM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

మరొకరికి గాయాలు
మూడుచింతలపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కార్ఖానాగడ్డకు చెందిన షేక్ సక్లిన్ అతని స్నేహితుడు మహమ్మద్ ఫుర్ఖాన్‌లు టీఎస్ 10 ఈఎక్స్ 7515 గల యాక్టీవా బైక్‌పై కరీంనగర్ నుంచి మెహదీపట్నంకు వెళ్తున్నారు. మార్గమధ్యలో ఓఆర్‌ఆర్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు వెనుక టైర్ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో సక్లిన్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలపాలైన ఫుర్ఖాన్‌ను చికిత్స నిమిత్తం తరలించారు. గాయాలయ్యాయి. తగిలాయి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సక్లిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.