Share News

కల్లుతాగి ఒకరి మృతి

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:14 AM

క్రిమిసంహారక మందు కలిసిన కల్లు తాగి ఒకరు మృతిచెందగా.. మరొకరు అస్వస్థతకు గురైన సంఘటన మండల పరిధిలోని పాతబ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈమేరకు గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన కేశమోని జంగయ్యగౌడ్‌ తాను కల్లు తీసే చెట్టుకు పురుగు పట్టిందని క్రిమిసంహారక మందును దూదికి అంటించి కల్లు కారేచోట ఉంచాడు.

కల్లుతాగి ఒకరి మృతి

మరొకరికి అస్వస్థత

మాడ్గుల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): క్రిమిసంహారక మందు కలిసిన కల్లు తాగి ఒకరు మృతిచెందగా.. మరొకరు అస్వస్థతకు గురైన సంఘటన మండల పరిధిలోని పాతబ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈమేరకు గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన కేశమోని జంగయ్యగౌడ్‌ తాను కల్లు తీసే చెట్టుకు పురుగు పట్టిందని క్రిమిసంహారక మందును దూదికి అంటించి కల్లు కారేచోట ఉంచాడు. అలా ఆ మందు కలిసిన కల్లును వారం రోజుల క్రితం జంగయ్యగౌడ్‌, అదే గ్రామానికి చెందిన కట్ట వెంకటయ్య తాగారు. దాంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వారిని కుటుంబ సభ్యులు మాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జంగయ్యగౌడ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఆదివారం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా కట్ట వెంకటయ్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు. మృతుడు జంగయ్యకు భార్య, ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:14 AM