అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:39 AM
శంకర్‌పల్లిలోని ఇంద్రారెడ్డి స్టేడియం వద్ద ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఇంద్రారెడ్డి స్టేడియంలో గల ఓ గదిలో ఉంటూ భీమయ్య (65) అనే వృద్ధుడు చెత్త ఏరుకుంటూ జీవనం సాగించేవాడు.

శంకర్‌పల్లి, జులై 4: శంకర్‌పల్లిలోని ఇంద్రారెడ్డి స్టేడియం వద్ద ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఇంద్రారెడ్డి స్టేడియంలో గల ఓ గదిలో ఉంటూ భీమయ్య (65) అనే వృద్ధుడు చెత్త ఏరుకుంటూ జీవనం సాగించేవాడు. కాగా, డబుల్ బెడ్‌రూమ్‌ల వద్ద ఉండే సెక్యూరిటీ గార్డు సుగార్‌సింగ్ భీమయ్యలు ప్రతీ రోజు ఆ ప్రాంతంలో ఉండే ఓ టీ స్టాల్‌లో టీ తాగేవారు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం టీ తాగేందుకు భీమయ్య రాకపోవడంతో సుగార్‌సింగ్ స్టేడియంలోని భీమయ్య గది వద్దకు వెళ్లి చూశాడు. అప్పటికే భీమయ్య రక్తం మడుగులో పడి ఉండటం గమనించి డయల్ 100కు ఫోన్ చేశాడు. సీఐ హబీబుల్లాఖాన్ సిబ్బందితో వెళ్లి శవాన్ని పరిశీలించారు. భీమయ్య గొంతు కోసి ఉందని, చేతిలో కత్తి ఉందని తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అయితే, ఎవరైనా చంపేసి చేతిలో కత్తి పెట్టి ఉంటారా? ఆయనే కత్తితో గొంతు కోసుకుని చనిపోయాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భీమయ్య కూతురు కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. స్వగ్రామం ఎక్కడనేది ఎవరికీ తెలియదు.