పాముకాటుకు వృద్ధురాలు మృతి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:19 AM
పాముకాటుకు వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని మేడిపల్లికలాన్ గ్రామంలో చోటుచేసుకుంది.

పూడూరు, జూలై 4: పాముకాటుకు వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని మేడిపల్లికలాన్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సనువెల్లి చంద్రమ్మ(73) మంగళవారం ఉదయం తన చేనులో కొత్తిమీర కోస్తుండగా ఓపాము తన ఎడమచేతి వేలికి కాటు వేసింది. గమనించిన అక్కడే ఉన్న తోటి కుటుంబీకులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రమ్మ గురువారం మృతి చెందింది. మృతురాలి భర్త చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.