Share News

మైనర్‌ నిశ్చితార్థాన్ని నిలిపివేసిన అధికారులు

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:48 PM

ఓ మైనర్‌ నిశ్చితార్థాన్ని అధికారులు నిలిపివేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..

మైనర్‌ నిశ్చితార్థాన్ని నిలిపివేసిన అధికారులు

మేడ్చల్‌ టౌన్‌, ఫిబ్రవరి 28 : ఓ మైనర్‌ నిశ్చితార్థాన్ని అధికారులు నిలిపివేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌ మండలానికి చెందిన పదో తరగతి బాలికకు మూసాపేట్‌కు చెందిన వ్యక్తితో వివాహం చేసేందుకు బాలిక తల్లిదండ్రులు గత ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నారు. గ్రామస్తులు కొందరు 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వగా అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలిక మేజర్‌ అయ్యేంత వరకు పెళ్లి చేయం అని రాయించుకుని నిశ్చితార్థాన్ని నిలిపేశారు.

Updated Date - Feb 28 , 2024 | 11:48 PM