Share News

ప్రజా సమస్యల అధ్యయనం కోసమే న్యాయ్‌ యాత్ర

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:43 PM

రాహుల్‌గాంధీ చేపడుతున్న న్యాయ్‌ యాత్రకు సంఘీభావంగా మహబూనగర్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో తాను ‘పాలమూరు న్యాయ్‌ యాత్ర’ చేపడుతున్నామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజా సమస్యల అధ్యయనం కోసమే న్యాయ్‌ యాత్ర
ఎస్‌బీ పల్లిలో పాలమూరు న్యాయ్‌ యాత్ర నిర్వహిస్తున్న వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాయకులు

సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి

కొత్తూర్‌, ఫిబ్రవరి 11 : రాహుల్‌గాంధీ చేపడుతున్న న్యాయ్‌ యాత్రకు సంఘీభావంగా మహబూనగర్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో తాను ‘పాలమూరు న్యాయ్‌ యాత్ర’ చేపడుతున్నామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తూర్‌ మండలం సిద్ధాపూర్‌లో అదివారం వంశీచంద్‌రెడ్డి న్యాయ్‌ యాత్రను షాద్‌నగర్‌, కల్వకుర్తి ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్‌, కె.నారాయణరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. సిద్ధాపూర్‌, ఎస్‌బీపల్లి, కొడిచర్ల, పెంజర్ల గ్రామాలు, కొత్తూర్‌ మున్సిపాలిటీలో కొనసాగింది. కార్నర్‌ మీటింగ్‌లో వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో ప్రజలను నట్టేట ముంచిందని, వాగ్దానాలను నేరవేర్చలేదన్నారు. ప్రజల సొమ్మును ఆ పార్టీ నేతలు దోచుకున్నారని, అందుకే ప్రజలు వారిని తరిమికొట్టారని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2నెలల్లోనే ఆరు గ్యారంటీ ల్లో రెండు నెరవేర్చారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ప్రజా సమస్యలను అధ్యయనం చేసేందుకే పాలమూరు న్యా య్‌ యాత్ర చేపట్టానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీటీసీలు దేశాల అంజమ్మ, కొమ్ము కృష్ణ, కుమారస్వామిగౌడ్‌, చంద్రపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు జె.వేణుగోపాల్‌గౌడ్‌, శివశంకర్‌గౌడ్‌, కొత్తూర్‌, నందిగామ మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు హరినాథ్‌రెడ్డి, నర్సింహ, నాయకులు ప్రభాకర్‌, కాశీనాథ్‌రెడ్డి, గోవర్ధన్‌గౌడ్‌, వి.దేవేందర్‌, రఘు, బాబర్‌ఖాన్‌, జె.సుదర్శన్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి, చెన్న య్య, సిద్ధార్థరెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డి, శ్రీను, రవికుమార్‌, నవీన్‌చారి, సురేందర్‌, రమేష్‌, బాల్‌రాజ్‌, సురేష్‌, సుధాకర్‌, మాణయ్య పాల్గొన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తేనే ప్రజలకు న్యాయం

నందిగామ: కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. వంశీచందర్‌రెడ్డి చేపట్టిన న్యాయ్‌ యా త్ర మండలంలోని చేగూర్‌, వెంకమ్మగూడ, వీర్లపల్లి, అప్పారెడ్డిగూడలో కొనసాగి రాత్రికి నందిగామలో కార్నర్‌ మీటీంగ్‌తో ముగిసింది. ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమొస్తే డబుల్‌ ఇంజన్‌ స ర్కార్లతో అభివృద్ధిని పరుగెట్టిస్తామన్నారు. లోక్‌సభ ఎన్ని కల్లో వంశీచందర్‌రెడ్డిని గెలిపిస్తే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందన్నారు. న్యాయ్‌యాత్రలో మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే నందిగామలో క్రికెట్‌ టోర్ని విజేతలకు ఎమ్మెల్యే, వంశీచంద్‌ బ హుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రి యాంక, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నర్సింలు, నాయకు లు పాండురంగారెడ్డి, క్రిష్ణ, పురుశోత్తంరెడ్డి, జితేందర్‌రెడ్డి, శంకరయ్య, బుచ్చయ్య, బాల్‌రాజ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 11:43 PM