రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:26 AM
తాండూరు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న 18 చౌకధరల దుకాణ డీలర్ల నోటిఫికేషన్ జారీ చేశామని ఆర్డీవో శ్రీనివా్‌సరావు బుధవా రం తెలిపారు.

తాండూరు, జూన్ 26: తాండూరు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న 18 చౌకధరల దుకాణ డీలర్ల నోటిఫికేషన్ జారీ చేశామని ఆర్డీవో శ్రీనివా్‌సరావు బుధవా రం తెలిపారు. జులై 3వ తేదీ వరకు దరఖాస్తులను ఆర్డీవో కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు. పది దినాలలో సాయంత్రం 5:30గంటల వరకు అందజేయొచ్చన్నారు. బషీరాబాద్ మండలం కంసాన్‌పల్లి(బి) దుకాణానికి జనరల్ లేడీ, పెద్దేముల్ మండలం గోపాల్‌పూర్, ఆత్కూర్ గ్రామాలకు ఎస్టీ జనరల్, ఖానాపూర్‌కు జనరల్ మహిళ, తాండూరుమండలం మిట్టబాస్పల్లి దుకాణానికి బీసీ-డి మహిళ, రాంపూర్ దుకాణానికి బీసీ-ఈ మహిళ, సంగెం కలాన్ బీసీ-ఎ, తాండూరులో షాప్ నం: 4116031కు జనరల్, షాప్ నం: 4116034కుఎస్సీ లేడీ, షాప్ నం: 4116035కు జనరల్ మహిళ, షాప్ నం:4116036కు బీసీ-బి, యాలాల మండలం ముకుందాపూర్ షాప్ ఎస్టీకి, కోకట్ జనరల్, రాఘవపూర్ ఎస్సీ, ఖానాపూర్ జనరల్, పగిడ్యాల్ దుకాణానికి బీసీ-ఎ, బాగాయిపల్లి దుకాణానికి జనరల్ లేడీ, ఇందిరమ్మ కాలనీకి బధిరులు(జనరల్)కు కేటాయించామని ఆర్డీవో వివరించారు. అభ్యర్థులు ఆయా గ్రామవాసులై, కనీసం పదో తరగతి పాసై ఉండాలన్నారు. 18 నుంచి 40ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని, రాత పరీక్ష, ఇంటర్య్వూ తేదీలను ప్రకటిస్తామని ఆర్డీవో తెలిపారు.