Share News

పనిచేయని అధికారులు స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:07 AM

పనిచేయని అధికారులు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కులను రైతు వేదికలో పంపణీ చేశారు.

పనిచేయని అధికారులు స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చు
పూడూరులోని రైతు వేదికలో కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పూడూరు, జనవరి 11: పనిచేయని అధికారులు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కులను రైతు వేదికలో పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.10కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ప్రభుత్వం త్వరలో అందించబోతుందన్నారు. మొత్తం 64 చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీడీవో ఉమాదేవి ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకు సంబంధించిన వీడియో రికార్డులు సైతం తమ వద్దకు వచ్చాయన్నారు. ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. పనిచేసే అధికారులకే ప్రభుత్వంలో పని చేయాలని, లేకపోతే స్వచ్చందంగా తప్పుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీ్‌షరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, షఖిల్‌, పెంటయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

దోమ: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను 68మందికి పంపిణీ చేశారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పీఆర్‌టీయూ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, తహసీల్దార్‌ పురుషోత్తం, ఎంఈవో హరిచందర్‌, ఎంపీటీసీలు అనిత, విజయ పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ క్యాలెండర్‌ ఆవిష్కరణ

పరిగి/కులకచర్ల/పూడూరు: పాంబండ దేవాలయం ఆవరణలో పీఆర్‌టీయూ నూతన సంవత్సరం క్యాలండర్‌ను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌, గౌరవ అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బస్వరాజ్‌, మండల విద్యాధికారి హబీబ్‌అహ్మద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్‌, రాష్ట్ర బాధ్యులు పరందాములు, పెంటయ్య, వెంకటేశ్‌, నర్సింహులు, సతీశ్‌, వెంకటయ్య, మాజీ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా, మండలకార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. అదేవిధంగా కేజీబీవీలోని సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపాల్‌ దేవి వినతిపత్రం అందించారు. అదేవిధంగా పూడూరు విద్యావనరుల కేంద్రంలో పీఆర్టీయూ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:07 AM