బల్దియా చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం!
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:13 AM
బల్దియా చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సొంత పార్టీ వారే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు.

సొంతపార్టీ నేతల నిర్ణయం
మాజీ ఎమ్మెల్యేను కలిసిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
తాండూరు, జనవరి 11: బల్దియా చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సొంత పార్టీ వారే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటి అవిశ్వాసంపై కలెక్టర్‌కు మెజార్టీ కౌన్సిలర్లు సంతకాలతో కూడి విన్నవించారు. చైర్‌పర్సన్ స్వప్న కోర్టును ఆశ్రయించడంతో అవిశ్వాసం అంశం పెండింగ్‌లో పడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ అవిశ్వాసం అంశం తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు గురువారం మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిసి అవిశ్వాసం అంశంపై చర్చించారు. అవిశ్వాసంపై అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఏడాది చైర్మన్ పదవి కోసం ఎందుకు ప్రయత్నించాలనే ధోరణిలో ఉన్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన చైర్‌పర్సన్ స్వప్నపై అవిశ్వాసాన్ని మహేందర్‌రెడ్డి నెగ్గనిస్తారా? అనేది చర్చనీయంగా మారింది. పార్టీ విప్‌ను జారీచేస్తే చైర్‌పర్సన్ స్వప్న పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, తాండూరు పట్టణంలో 36 వార్డులున్న తాండూరు మున్సిపాలిటీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల బలాబలాలు మారాయి. 24మంది కౌన్సిలర్లు ఉన్న బీఆర్‌ఎ్‌సకు ఇప్పుడు 18మంది కౌన్సిలర్లు ఉన్నారు (చైర్‌పర్సన్‌తో కలిపి) ముగ్గురు కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ తొమ్మిదికి చేరింది. బీజేపీ ఐదు, ఎంఐఎం మూడు, టీజేఎస్ ఒకరు ఉన్నారు.