వైద్యసేవల్లో నిర్లక్ష్యం తగదు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:46 PM
ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం తగదని షాద్‌నగర్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో విజయలక్ష్మి సూచించారు.

డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయలక్ష్మి
కేశంపేట, జూన్ 7: ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం తగదని షాద్‌నగర్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో విజయలక్ష్మి సూచించారు. ఈనెల 6న సాయంత్రం ఓ వ్యక్తి క్రిమిసంహారక మందు తాగడంతో కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తీసుకరాగా.. వైద్య సిబ్బంది లేక పోవడంతో షాద్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆయితే, ఈ విషయం డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వోకు బాధితులు ఫిర్యాదు చేశారు. దాంతో శుక్రవారం కేశంపేట పీహెచ్‌సీలో విచారణ చేశారు. వైద్యసేవలు సకాలంలో అందకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులు మారే సమయంలో ఒకరు వచ్చిన తరువాతనే మరొకరు వెళ్లాలని సూచించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఆమె గ్రామస్తులతో మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు తలసాని వెంకట్‌రెడ్డి, యెన్నం శ్రీధర్‌రెడ్డి, శివాజీలు పాల్గొన్నారు.