Share News

నీట్‌ అవకతవకలపై విచారణ జరిపించాలి

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:11 AM

నీట్‌ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు తెల్గమల్ల జగన్‌, పట్టణాధ్యక్షుడు మానయ్య, జిల్లా నాయకుడు మండ్లీరాములులు డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, నీట్‌ పరీక్షల్లో అవకతవకలకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని వారు ఆరోపించారు.

నీట్‌ అవకతవకలపై విచారణ జరిపించాలి
కడ్తాల : ధర్నాలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

ఆమనగల్లు, జూన్‌ 21: నీట్‌ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు తెల్గమల్ల జగన్‌, పట్టణాధ్యక్షుడు మానయ్య, జిల్లా నాయకుడు మండ్లీరాములులు డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, నీట్‌ పరీక్షల్లో అవకతవకలకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని వారు ఆరోపించారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం నీట్‌ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్‌ చౌక్‌ వద్ద బైటాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. మోదీ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు తదితరులున్నారు.

షాద్‌నగర్‌ : నీట్‌ లీకేజీపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. అంగట్లో సరుకు మాదిరిగా ప్రశ్న పత్రాలు అమ్ముకుని విద్యార్థుల జీవితాలను అగాధంలోకి నెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు యాదయ్య, చెన్నయ్య తదితరులు ఉన్నారు.

కడ్తాల్‌ : నీట్‌ -2024 పేపర్‌ లీకేజీకి మోదీ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధికారప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహలు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బీచ్యనాయక్‌ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలున్నారు.

చేవెళ్ల : నీట్‌ పేపర్‌ లీకేజీ దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎ్‌ఫఐ చేవెళ్ల డివిజన్‌ అధ్యక్షకార్యదర్శులు శ్రీనివాస్‌, అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నాయకులు గౌలికర్‌ సాయి, గణేశ్‌, సమీర్‌, హరీష్‌, ప్రశాంత్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 12:11 AM