Share News

దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:09 AM

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి సాగర్‌ అన్నారు.

దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలి
యాచారం: తమ్మలోనిగూడలో కరపత్రాలు విడుదల చేస్తున్న సాగర్‌

యాచారం, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి సాగర్‌ అన్నారు. సోమవారం యా చారం మండలం మాల్‌, తమ్మలోనిగూడ గ్రామాల్లో పర్యటించి బంద్‌పై ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తేవడంతో పేద, మధ్య తరగతి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. లేబర్‌ కోడ్‌ల ను రద్దుచేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు శోభన్‌, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు రమే ష్‌, పి.అంజయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

కేశంపేట : వివిధ రంగాల గ్రామీణ కార్మికులు, అంగన్‌వాడీలు, ఆశాలు, పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికే ఈ నెల 16న దేశవ్యాప్త గ్రామీణ కార్మికుల సమ్మె చేపడుతున్నామని తెలంగాణ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నరసింహారెడ్డి అన్నారు. కేశంపేట మండల పరిషత్‌ ఆవరణలో కార్మికుల తో కలిసి సమ్మె పోస్టర్‌ విడుదల చేశా రు. అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం రూ.26వేలివ్వాలని డిమాండ్‌ చే శారు. నాలుగు లేబర్‌ కోడ్‌, ఎన్‌ఈపీ చ ట్టం, విద్యుత్‌ సవరణ బిల్లును రద్దుచేయాలన్నారు. సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు రామచంద్ర య్య, పారేశ్‌, రోశయ్య, జంగయ్య, రాములు, యాదయ్య, పద్మమ్మ, మల్లేష్‌ పాల్గొన్నారు.

నందిగామ: అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే దేశవ్యాప్త కార్మిక సమ్మె, భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ, టీఎన్‌టీయూసీ నాయకులు సాయిబాబ, యాదగిరిచారి, గణేష్‌, రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తూరలో వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షకులకు, రైతులకు వ్యతిరేకంగా అనేక చట్టాలను తెచ్చి ప్రజల జీవి తాలను ఆగం చేస్తోందన్నారు. కార్మికులకు 8గంటల పనిదినం కల్పించి, కనీస వేతనం రూ.30వేల జీతం ఇచ్చేలా చట్టం తేవాల న్నారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, డీజిల్‌, పెట్రోల్‌లను జీఎస్టీ పరిధికి తేవాలన్నారు. సమ్మెలో ప్రజలందరూ పాల్గొని మద్దతివ్వాలని కోరారు.

ఆమనగల్లు: బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కార్పొరేట్లు, ప్రైవేట్‌ కంపెనీల కొమ్ముకాస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రై వేట్‌కు ధారాదత్తం చేసి ఉద్యోగులు, కార్మికులను రోడ్డు పాలుచేస్తున్నారని మండిపడ్డారు. ఆమనగల్లు ఎంఈవో కార్యాలయం వద్ద సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ విజయవంతంపై భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. రమ, భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, నాయకులు ఆంజనేయులు, వెంకటయ్య, శివశంకర్‌ హాజరయ్యారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర విధానాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికులు పద్మ, గోజి, లక్ష్మణ్‌, అలివేలు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:09 AM