Share News

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:54 PM

జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని బుధవారం అన్ని పాఠశాలల్లో నిర్వహించారు. విద్యార్థులు పలు విధాల సైన్స్‌ ప్రయోగాలను ప్రదర్శించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు బహుమతులు అందజేసి అభినందించారు.

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం
పూడూరులో ప్రదర్శనలను తిలకిస్తున్న సెహగల్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ శ్రుతి

దోమ, ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని బుధవారం అన్ని పాఠశాలల్లో నిర్వహించారు. విద్యార్థులు పలు విధాల సైన్స్‌ ప్రయోగాలను ప్రదర్శించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు బహుమతులు అందజేసి అభినందించారు. దోమ మండలం బొంపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారుచేసిన ప్రయోగాలను ఉపాధ్యాయులు పరిశీలించారు. సైన్స్‌ క్విజ్‌, వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సైన్స్‌తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, కరోనా వంటి కష్ట కాలంలోనూ మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ తయారు చేసి ఎన్నో దేశాల ప్రజలను కాపాడారని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం మాధురి, ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎం షఫీ, ఉపాధ్యాయులు ప్రవీణ్‌కుమార్‌, విజయ్‌సాయి పాల్గొన్నారు.

పరిగి: మండలంలోని పాఠశాలల్లో సైన్స్‌ దినోత్సవాన్ని జరుపుకున్నారు. చంద్రశేఖర వెంకట్రామన్‌ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్‌ డే నిర్వహిం చారు. ప్రభుత్వ పాఠశాలలు, సుదీక్షస్కూల్‌, భృంగి విద్యాలయాల్లో పలు రకాల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. సుదీక్ష స్కూల్‌లో సైన్స్‌, మ్యాథ్స్‌ ఫెయిర్‌, కూరగాయల సంతను నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. సుదీక్ష డైరెక్టర్‌ వీరేశం మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు సెన్స్‌ ఫేర్‌ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.అమర్‌నాథ్‌ సూచి ంచారు. జడ్పీహెచ్‌ఎ్‌స:2లో విద్యార్థులు 40కి పైగా ప్రయోగాలను ప్రదర్శించారు. పాల్గొన్న అమర్‌నాథ్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి ఎదగాలన్నారు. సీవి రామన్‌ 1928 ఫిబ్రవరి 28న కనిపెట్టిన రామన్‌ ఎఫెక్ట్‌పై వివరించారు.

కులకచర్ల: కులకచర్లలోని కేవీఎం పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రయోగాలను బీజేపీ రాష్ట్ర నాయకులు కరణం ప్రహ్లాద్‌రావు, తహసీల్దార్‌ మురళీధర్‌, ఎంఈవో హబీబ్‌ అహ్మద్‌ పరిశీలించారు. హెచ్‌ఎం సాయి పాల్గొన్నారు.

బొంరా్‌సపేట్‌: బొంరా్‌సపేట్‌ రెయిన్‌బో పాఠశాలలో విద్యార్థులు పలు నమునాలను ప్రదర్శించారు. కరస్పాండెంట్‌ రాఘవేందర్‌యాదవ్‌ మాట్లాడుతూ మానవళి అభివృద్ధికి సైన్స్‌ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో టీచర్లు శ్యామ్‌, హైమద్‌, పార్వతి, కవిత, స్వరూప, సనా, శ్రీవాణి, నవనీత, సమ్రీన్‌, రూపవతి, శ్రీలత పాల్గొన్నారు.

మేడ్చల్‌ టౌన్‌: విద్యార్ధుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్‌ఫేర్లు ఎంతగానో దోహద పడుతాయని సెహగల్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ శ్రుతి అన్నారు. మండలంలోని పూడూరు పాఠశాలలో నిర్వహించిన సైన్స్‌ ఫేర్‌లో ఆమె విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్‌ ప్రయోగాలకు తిలకించారు. సాంకేతికతను అందిపు చ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కషిచేయాలన్నారు. కార్యక్రమంలో పూడూరు కాంప్లెక్స్‌ పాఠశాల హెచ్‌ఎం శంకరయ్య, సైన్స్‌ ఉపాధ్యాయుడు మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.

కీసర: కీసరలోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్‌ డే నిర్వహించారు. విద్యార్థులు పలు ఆవిష్కరణలను రూపొందించారు. ప్రయోగాలను పరిశీలించిన ఎంఈవో శశిధర్‌ బహుమతులు అందజేశారు.

కొడంగల్‌: కొడంగల్‌లోని నవీన ఆదర్శ కాన్వెంట్‌ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ నమూనాలను ఉపాధ్యాయులు పరిశీలించి అభినందించారు. సైన్స్‌ గురించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు వివరించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ హెచ్‌ఎం రాములు, పాఠశాల వ్యవస్థాపకుడు డి.వెంకటయ్య, కరస్పాండెంట్‌ డి.లక్ష్మి, ప్రిన్సిపాల్‌ డీవీ.నరేశ్‌రాజ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సంతోష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బంట్వారం(కోట్‌పల్లి): విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని బార్వాద్‌ ఉన్నత పాఠ శాల హెచ్‌ఎం వెంకటరత్నం అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్‌, రాంచంద్రయ్య, అనిత,రాజశేఖర్‌, విజయ, ఫరూక్‌, కిష్టయ్య పాల్గొన్నారు.

శామీర్‌పేట: తూంకుంటలోని ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ప్రదర్శనలు ఎంఈవో వసంతకుమారి తిలకించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పరికరాల గురించి వివరించారు. ఎంఈఓ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చితే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశం, తిరుమలేష్‌, మేరి, నాగశారద, వనజ, శ్రీదేవి, శైలజ, మంజుల, రజిని, అమీనాబి పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:54 PM