ఎయిర్‌పోర్టులో మరిన్ని మెరుగైన సౌకర్యాలు
ABN , Publish Date - Jul 26 , 2024 | 12:06 AM
విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని జీఎంఆర్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శంషాబాద్ రూరల్, జూలై 25 : విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని జీఎంఆర్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విమానాశ్రయంలో రద్దీ సమయాల్లో చాలామంది ప్రయాణికులు యాప్ ఆఽధారిత క్యాబ్‌ల(ఓలా, ఉబెర్)ను సంప్రదిస్తారని, రాత్రివేళల్లో కొన్నిసార్లు క్యాబ్‌లు అందుబాటులో లేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అయితే, క్యాబ్ యాజమాన్యాలతో మాట్లాడి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు వారికి నచ్చిన క్యాబ్‌లను ఎంచుకోవచ్చని, ఇప్పటికే క్యాబ్ ఆపరేటర్ల యజమానులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎయిర్‌పోర్టులో వేచి ఉండేందుకు చెల్లించే ఫీజును మాఫీ చేయడానికి క్యాబ్ సర్వీసుల అగ్రిగేటర్లతో మాట్లాడుతున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ క్యాబ్‌లు దొరకని సమయంలో హెల్ప్‌డె్‌స్కకు సమాచారం అందిస్తే.. వెంటనే క్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని జీఎంఆర్ పేర్కొంది. ఎయిర్‌పోర్టులో కొందరు ప్రయివేట్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు స్ధానిక పోలీసులతో కలిసి పని చేస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులకు గురిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ఎయిర్‌పోర్టు అధికారులు హెచ్చరించారు.