Share News

మొయినాబాద్‌లో దోపిడీ దొంగల బీభత్సం

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:02 AM

మొయినాబాద్‌ మండల కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దర్జాగా కారులో వచ్చి సిమెంట్‌, స్టీలు దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. పోలీ్‌సలు తెలిపిన వివరాల ప్రకారం..

మొయినాబాద్‌లో దోపిడీ దొంగల బీభత్సం

మొయినాబాద్‌, జూలై 24 : మొయినాబాద్‌ మండల కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దర్జాగా కారులో వచ్చి సిమెంట్‌, స్టీలు దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. పోలీ్‌సలు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో సిమెంట్‌, స్టీలు దుకాణం, పూజా సామగ్రి, జ్యువెలరీ దుకాణాల షట్టర్ల తాళాలను పగులగొట్టే యత్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు తాళం విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. ఈమేరకు వీడియో విజువల్స్‌ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీ్‌సలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 25 , 2024 | 12:02 AM