Share News

స్థల దాతకు సన్మానం

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:53 PM

అంతారం తండాలోని పంచాయతీ భవన నిర్మాణానికి స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చిన దాత వాసుపవార్‌ను తండా వాసులు సన్మానించారు.

స్థల దాతకు సన్మానం
దాత వాసుపవార్‌నాయక్‌, ఎమ్మెల్యేను సన్మానిస్తున్న తండావాసులు

తాండూరురూరల్‌, జనవరి 29: అంతారం తండాలోని పంచాయతీ భవన నిర్మాణానికి స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చిన దాత వాసుపవార్‌ను తండా వాసులు సన్మానించారు. సోమవారం ఎమ్మెలే ్య మనోహర్‌రెడ్డి గ్రామంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించగా, తండా వాసులు ఎమ్మెల్యేతోపాటు వాసుపవార్‌ను సన్మానించారు. పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం లేకపోవడంతో వాసుపవార్‌నాయక్‌ తండాలో గుండ్యానాయక్‌కు చెందిన స్థలాన్ని రూ.2లక్షల 50వేలకు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వాసుపవార్‌ను స్థానికులుఅభినందించారు. ఆయనతోపాటు సర్పంచ్‌ సావిత్రిబాయి రాంచందర్‌, ఎంపీపీ అనితాగౌడ్‌, జడ్పీటీసీ మంజుల, వైస్‌ ఎంపీపీ స్వరూపాలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, పంచాయతీ అధికారి రతన్‌సింగ్‌, డీఈ వెంకట్‌రావు, ఏఈ నందిని, కాంగ్రెస్‌ నాయకులు జనార్దన్‌రెడ్డి, ఉత్తమ్‌ చంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:53 PM