Share News

బీరప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

ABN , Publish Date - May 19 , 2024 | 11:43 PM

మండలంలోని దామర్‌చేడ్‌ గ్రామంలో కొలువైన బీరప్పస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా ఆదివారం జరిగాయి.

బీరప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
స్వామి వారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి

బషీరాబాద్‌, మే 19: మండలంలోని దామర్‌చేడ్‌ గ్రామంలో కొలువైన బీరప్పస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా ఆదివారం జరిగాయి. భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్దంగా గొల్ల, కురుమలు జాతర ఉత్సవాలను నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నవాంద్గి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అజయ్‌ ప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కలాల్‌ నర్సింహులు గౌడ్‌, సీనియర్‌ నాయకులు రామునాయక్‌, మాజీ ఎంపీటీసీ నరేష్‌, కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌, స్థానిక నాయకులు నరేష్‌ ఉన్నారు.

నిత్యాన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తాండూరు: వేసవి ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘం, వాసవీక్లబ్‌, ఇంటర్నేషనల్‌, వైశ్యఫెడరేషన్‌ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌, సంఘాల ప్రతినిధులు రొంపల్లి సంతోష్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, కరుణం పురుషోత్తం రావు, కౌన్సిలర్‌ ప్రభాకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 11:43 PM