Share News

ప్రారంభానికి సిద్ధంగా ఎమ్మెల్యే కార్యాలయం

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:06 AM

వికారాబాద్‌ నియో జకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముస్తాబవుతోంది. కొత్తగా ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికవడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వారికి తగ్గట్లు ముస్తాబు చేసుకున్నారు.

ప్రారంభానికి సిద్ధంగా ఎమ్మెల్యే కార్యాలయం
క్యాంపు కార్యాలయం పనులు పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి

వికారాబాద్‌, జనవరి 13: వికారాబాద్‌ నియో జకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముస్తాబవుతోంది. కొత్తగా ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికవడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వారికి తగ్గట్లు ముస్తాబు చేసుకున్నారు. ఇప్పటికే క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రహరీతో పాటు లోపల అవసరమైన మరమ్మతులు చేశారు. అదేవిధంగా కొత్తగా రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు. ఈ పనులను స్థానిక పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.

అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన నాయకులు

లియాఫీ ఆలిండియా సలహాదారు సింగారపు శ్రీనివాస్‌ నేతృత్వంలో వికారాబాద్‌ ఎమ్మెల్యే ప్రసాద్‌ కుమార్‌ శాసన సభ స్పీకర్‌గా ఎన్నికైన నేపథ్యంలో శనివారం వారిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా శనివారం కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ లియాఫీ సమావేశానికి రావాలని నేతలు స్పీకర్‌ను ఆహ్వానించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో లియాఫీ హైదరాబాద్‌ డివిజన్‌ కౌన్సిల్‌ కార్యదర్శి సుదర్శనం, కన్వీనర్‌ కిచన్నగారి వెంకట్‌ రెడ్డి, ఆలిండియా కార్యవర్గ సభ్యులు బస్వలింగం పటేల్‌, వికారాబాద్‌ బ్రాంచ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బి.శ్రీనివాస్‌, బి.మాణిక్యరెడ్డి, సీనియర్‌ నాయకులు కృష్ణారెడ్డి, కేఎ్‌సఎన్‌.రెడ్డి, గడిల మల్లారెడ్డి ఉన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 12:06 AM