అనుచితంగా వ్యవహరించిన వ్యక్తి రిమాండ్
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:46 PM
మద్యం సేవించకూడదని వారించిన పోలీసు సిబ్బందిపై అనుచితంగా వ్యవహరించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపారు.
ధారూరు, సెప్టెంబరు 10: మద్యం సేవించకూడదని వారించిన పోలీసు సిబ్బందిపై అనుచితంగా వ్యవహరించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 8వ తేదీన ఆదివారం కోట్‌పల్లి ప్రాజెక్టు ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న కేశంపేట మండలానికి చెందిన శివకుమార్‌ను పోలీసు సిబ్బంది వారించారు. ఇక్కడ మద్యం సేవించకూడదని సూచించిన పోలీసు సిబ్బందిపై శివకుమార్ అనుచితంగా ప్రవర్తించారని ఎస్‌ఐ వివరించారు. నిందితుడు శివకుమార్‌ను అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండు విధించినట్లు ఆయన తెలిపారు.