Share News

కనీస వేతనాల జీవో వెంటనే అమలు చేయాలి

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:36 AM

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాల జీవోను సవరించి వెంటనే అమలు చేయాలని మజ్దూర్‌ సంఘ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ్‌ గౌడ్‌ అన్నారు.

కనీస వేతనాల జీవో వెంటనే అమలు చేయాలి
మేడ్చల్‌ కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న మజ్దూర్‌ సంఘ్‌ యూనియన్‌

కీసర, ఫిబ్రవరి 27: ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాల జీవోను సవరించి వెంటనే అమలు చేయాలని మజ్దూర్‌ సంఘ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ్‌ గౌడ్‌ అన్నారు. కనీస వేతనాల జీవోను సవరించి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఈఎ్‌సఐ, పీఎఫ్‌ సౌకర్యాం కల్పించాలని, ఆయుష్మాన్‌ భారత్‌ వర్తింప చేయాలని ధనుంజయ్‌ గౌడ్‌ అన్నారు. అదే విధంగా 10 సంవత్సరాలుగా అమలు చేయని స్ర్టీట్‌ వెండర్స్‌ చట్టాన్ని అమలు చేయాలని, విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్‌లను పర్మినెంట్‌ చేయాలన్నారు. టీఎ్‌సఆర్‌టిసి కార్మికులను వెంటనే ప్రభుత్వంతో విలీనం చేసే ప్రక్రియ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు అందజేయాలన్నారు. ఈపీఎఫ్‌ 95 పెన్షన్‌ను వెంటనే 50 వేలు అమలు చేయాలని, అంగన్‌వాడీ, ఆశ, మిడ్‌డే మిల్స్‌, ఎన్‌హెచ్‌ఎమ్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేడ్చల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జయేందర్‌, వెంగల్రావ్‌, శ్రీధర్‌ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:36 AM