విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:12 AM
మండల పరిధి అల్వాల శివారులో కరెంట్ షాక్‌తో వలస కూలీ మృతిచెందాడు.

కేశంపేట, ఏప్రిల్ 2 : మండల పరిధి అల్వాల శివారులో కరెంట్ షాక్‌తో వలస కూలీ మృతిచెందాడు. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జార్జికుమార్, అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లు అల్వాల శివారులో సిమెంట్ పలుకలు, స్తంభాల తయారీ పనుల్లో దండె మహేష్ అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఈ ముగ్గురు పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. వారిలో అనిల్‌కుమార్(22) తీవ్రంగా గాయపడ్డాడు. షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనిల్ అన్న మనోజ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై వివరించారు.