Share News

అర్హత లేకుండానే వైద్యం..

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:27 AM

ఎంపీ పటేల్‌ గూడ లోని ఓ ప్రయివేటు క్లినిక్‌లో బుధవారం తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అధికారులు తనిఖీలు చేశారు. అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించడంతో పాటు లైసెన్స్‌ లేకుండా మందులు నిల్వచేస్తున్నట్లు గుర్తించి అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు.

అర్హత లేకుండానే వైద్యం..

ప్రైవేట్‌ క్లినిక్‌లో డీసీఏ తనిఖీలు

రూ57 వేలు విలువచేసే 87 రకాల మందులు స్వాధీనం

ఆదిభట్ల జనవరి 10 : ఎంపీ పటేల్‌ గూడ లోని ఓ ప్రయివేటు క్లినిక్‌లో బుధవారం తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అధికారులు తనిఖీలు చేశారు. అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించడంతో పాటు లైసెన్స్‌ లేకుండా మందులు నిల్వచేస్తున్నట్లు గుర్తించి అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఎంపీ పటేల్‌ గూడలో కొన్నేళ్లుగా కె.హనుమంతరావు ప్రయివేటు క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు, అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు బుధవారం డీసీఏ అధికారులు క్లినిక్‌లో తనిఖీలు నిర్వహించారు. అర్హతలు లేకుండా వైద్యం చేయడంతో పాటు పెద్ద మొత్తంలో విక్రయించడానికి నిల్వఉంచిన రూ.57 వేలు విలువచేసే 87రకాల మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్టేషన్‌ రంగారెడ్డి జిల్లా అసిస్టేంట్‌ డైరెక్టర్‌ అంజుమ్‌ అబిదా, డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్‌, నాగరాజు, ఎల్‌ రాజు తనిఖీలో పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 07:05 AM