Share News

రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:54 PM

మెడికల్‌, వెటర్నరీ కళాశాలల ఏర్పాటులో భాగంగా సర్వే నెంబర్‌ 19లో భూములు ఇచ్చిన రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. సర్వే నెంబర్‌ 19 పరిధిలోని అసైన్డ్‌ భూములకు పరిహారం అందించగా ఇంటి స్థలాల పట్టాలను అందించే ప్రక్రియను వేగవంతం చేశారు.

రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు
భూములు ఇచ్చిన రైతులకు ఇంటి స్థలాల పట్టాలు అందిస్తున్న తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్‌

కొడంగల్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌, వెటర్నరీ కళాశాలల ఏర్పాటులో భాగంగా సర్వే నెంబర్‌ 19లో భూములు ఇచ్చిన రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. సర్వే నెంబర్‌ 19 పరిధిలోని అసైన్డ్‌ భూములకు పరిహారం అందించగా ఇంటి స్థలాల పట్టాలను అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. రెండు రోజులుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పలువురు రైతులకు పట్టాలు అందించగా.. మిగతా వారికి పూర్తిస్థాయిలో అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, పరిహారం పూర్తిస్థాయిలో అందించిన తర్వాత పనులు చేపట్టాలని రైతులు ఇటీవలే సర్వే సిబ్బందితో తెలిపారు. దాంతో అధికారులు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:54 PM