తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:41 PM
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
పరిగి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్‌లో మిషన్‌భగీరథలో నీటి సరఫరా సహాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి సమస్యల పరిష్కారానికి నిధుల కొరత లేదని, ఉన్న వనరులను వృథా కాకుండా సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మినరల్ వాటర్ కూడా గడువు తర్వాత విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ఎంఏ కరీం, డీఈఈ సుబ్రమాణ్యం, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.