Share News

చికిత్స పొందుతూ వివాహిత మృతి

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:12 AM

కడుపు నొప్పి భరించక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓవివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

చికిత్స పొందుతూ వివాహిత మృతి

కులకచర్ల, జూలై 1: కడుపు నొప్పి భరించక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓవివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన కులకచర్ల మండలంలోని తిరుమలాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరటి సత్తయ్య భార్య రాములమ్మ(31) కొన్ని రోజులుగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతోంది. గతనెల 26వ తేదీన నొప్పి కాస్త అధికం కావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు పాలమూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రాములమ్మ సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అన్వే్‌షరెడ్డి తెలిపారు.

పురుగుల మందు తాగి బాలుడు..

కొడంగల్‌ రూరల్‌: పురుగుల మందు తాగి ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గుండ్లకుంట గ్రామానికి చెందిన వడ్ల వెంకటేశ్‌(16) గత కొంత కాలంగా అనారోగ్య (శుద్దకట్టు) సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిండ్రులు వెంకటేశ్‌కు ఆరు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో మూత్రం చేసే సమయంలో మూత్రనాళం మంట భరించలేక సోమవారం గుండ్లకుంట శివారులోని తమ వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంకటేశ్‌ను కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి పెద్ద భీములు ఫిర్యాదు మేరకు సీఐ శ్రీధర్‌రెడ్డి ఆదేశానుసారం హెడ్‌కానిస్టేబుల్‌ శివరాములుగౌడ్‌ కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 02 , 2024 | 08:39 AM