Share News

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:03 AM

వరకట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

మొయినాబాద్‌, మార్చి 10 : వరకట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్‌ మండల పరిధిలోని నందనవనం గ్రామానికి చెందిన బీమమ్మ కుమార్తె లావణ్య(18) వివాహం సంగారెడ్డి జిల్లా చెర్లగూడెం గ్రామానికి చెందిన పందిగోటె రవితో నాలుగు నెలల క్రితం పెద్దల సమక్షంలో జరిగింది. బతుకు దెరువు కోసం వచ్చి మండల పరిధిలోని చిల్కూర్‌ గవర్నమెంట్‌ క్వార్టర్స్‌లో కూలీ పని చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. వివాహం జరిగిన కొద్ది రోజులు వీరి కాపురం సాఫీగానే సాగింది. కానీ నెల రోజుల నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని లావణ్య తన తల్లితో చెప్పడంతో పెద్దమనుషులు భార్యతో గొడవ పడొద్దని రవికి నచ్చజెప్పారు. అయినా అతనిలో మార్పురాలేదు. కాగా పెళ్లి సమయంలో కట్నం ఇవ్వలేదని ఆ డబ్బులు తీసుకురావాలని రవి లావణ్యను వేధించేవాడు. ఈ విషయాన్ని లావణ్య తన తల్లితో చెప్పడంతో ఆమె రవికి ఫోన్‌ చేసి భార్యతో గొడవపెట్టుకోవద్దని సూచించింది. కాగా ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని లావణ్య ఆత్మహత్య చేసుకుంది. అయితే రవి వరకట్నం వేధింపుల వల్లనే లావణ్య చనిపోయిందని ఆమె తల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Updated Date - Mar 11 , 2024 | 12:03 AM