వివాహిత అదృశ్యం
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:37 PM
వివాహిత అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఘట్‌కేసర్ రూరల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వివాహిత అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఘట్‌కేసర్ మున్సిపల్ పటేల్‌నగర్‌కు చెందిన దర్శనం కృష్ణ కూలీపని చేసుకుంటూ భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. భార్య సునీత(35) స్థానిక గురుకుల్ కాలేజీలో ఉండే తన అన్న కూతురు కోసం వెళ్లి వస్తానని చెప్పి ఈనెల 21 ఉదయం 8.30గంటలకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో భర్త కృష్ణ తెలిసిన వారిని, బంధువులను విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.