Share News

వివాహిత అదృశ్యం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:16 AM

వివాహిత అదృశ్యమైన ఘటన గురువారం శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌గూడ సమీపంలో ఓ వెంచర్‌లో గల ఫౌంహౌ్‌సలో వాచ్‌మన్‌గా లక్ష్మినారాయణ, మమత దంపతులు పని చేస్తున్నారు. ఈ నెల 10న లక్ష్మినారాయణ పని నిమిత్తం తూక్కుగూడకు వెళ్లారు.

వివాహిత అదృశ్యం

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 11 : వివాహిత అదృశ్యమైన ఘటన గురువారం శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌గూడ సమీపంలో ఓ వెంచర్‌లో గల ఫౌంహౌ్‌సలో వాచ్‌మన్‌గా లక్ష్మినారాయణ, మమత దంపతులు పని చేస్తున్నారు. ఈ నెల 10న లక్ష్మినారాయణ పని నిమిత్తం తూక్కుగూడకు వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూడగా.. ఫౌంహౌ్‌సలో భార్య మమత కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. కాగా, మహేష్‌ అనే వ్యక్తిపై అనుమానం ఉందని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి..

శంషాబాద్‌రూరల్‌, జనవరి 11 : మతి స్దితిమిత్తం సరిగా లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన గురువారం శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్దషాపూర్‌ తండాకు చెందిన భాస్కర్‌నాయక్‌, గతేడాది నవంబరు 27న ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గతేడాది డిసెంబరు 6న హైదరాబాద్‌లోని బస్‌స్టాండ్‌లో ఉన్నానని గుర్తుతెలియని వ్యక్తి ద్వారా తన సోదరుడికి ఫోన్‌ చేశాడు. అయితే, మతిస్థిమితం సరిగా లేదు కావున ఎప్పటికైన ఇంటికి వస్తాడులే అని కుటుంబసభ్యులు వేచిచూశారు. కాగా, ఫోన్‌ చేసి 15 రోజులు దాటినా ఇంటికి రాకపోవడంతో గురువారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:16 AM