Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:36 AM

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 29 : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై మైబెల్లి తెలిపిన వివ రాల ప్రకారం.. నాగన్‌పల్లికి చెందిన కొత్తరావుల జంగయ్య(55), కొత్తరావుల మల్లేష్‌(38) అన్నదమ్ములు. ఈ నెల 26న ఇబ్రహీంపట్నంలో తన బంధువుల ఎంగేజ్‌మెంట్‌లో పాల్గొన్నారు. అనంతరం రాత్రి ఇద్దరూ కలిసి బైక్‌ (ఏపీ29 బీడీ3202)పై స్వగ్రామానికి వస్తుండగా ముకునూర్‌ సమీపంలో బీరప్పస్వామి ఆలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఇద్దరూ గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు నగరంలోని ఆసుపత్రికి తరలించగా జంగయ్య ఆదివారం రాత్రి మరణించాడు. మల్లేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Updated Date - Apr 30 , 2024 | 08:25 AM